నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ స్టార్ట్..

0
44

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘లవ్ స్టోరీ’. తాజాగా సంక్రాంతి కానుకగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ పోస్టర్ లో చైతు పల్లవిలు రొమాంటిక్ గా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సాంగ్స్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ కానున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. సంక్రాంతి తర్వాత ఈ మూవీ చివరి షెడ్యూల్ షూట్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. డైరెక్టర్ శేఖర్ ఖమ్ముల ‘ఫిదా’ చిత్రం తర్వాత ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’ తో మన ముందుకు రాబోతున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, దేవయాని ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here