నాగ చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ మూవీలో నటించనున్నారని వినికిడి. అంతేకాకుండా ఈ చిత్రంలో రష్మిక మండన్న హీరోయిన్ గా ఎంపిక చేయనున్నారట. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం నాగ చైతన్య ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.