ఈ ధాన్యాన్ని పండించే రైతుకెంత పవరు పొగరు ఉంటుందో చూపించమంటావా.. నందమూరి బాలకృష్ణ ‘రూలర్’

1
105

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్’. ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ‘రూలర్’ ట్రైలెర్ ను విడుదల చేసారు.

ఈ ట్రైలర్ ‘ఫైర్ ఇంజన్ కు కాల్ చేస్తున్నావా అంటే కాదు ఆ ఫైర్ కే కాల్ చేస్తున్నా అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఫైర్ బాలకృష్ణ అని అర్ధమవుతోంది. ‘ఈ ధాన్యం తినే మీరే ఇంత పొగరు చూపిస్తుంటే ఈ ధాన్యాన్ని పండించే రైతుకెంత పవరు పొగరు ఉంటుందో చూపించమంటావా…. వాసం చేయడానికి ఇది దెబ్బతిన్న పులిరా అంత తొందరగా చావదు వెంటాడి వెంటాడి చంపుద్ది..’ అనే డైలాగ్స్ తో ది రియల్ యాక్షన్ హీరో ఈజ్ బ్యాక్ అనిపించారు బాలయ్య బాబు.

3 గంటల్లోనే ౩లక్షల వ్యూస్ 30 వేల లైక్స్ ని సాధించి ట్రెండింగ్ లో ఉంది. ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఇస్తూ వచ్చిన బాలయ్య ఈ సినిమాలో వ్యవసాయంతో క్రైమ్ తగ్గించొచ్చని, రైతుల మీద మంచి మెసేజ్ ఇవ్వనున్నారని అర్ధమవుతోంది.

చిరంతన్‌ భట్‌ చక్కటి మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 14న విశాఖ ఎంజీఎం గ్రౌండ్‌లో ‘రూలర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్‌’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here