నాని, సుధీర్ బాబు ‘వి’ టీజర్ అప్డేట్..

0
164

నేచురల్ స్టార్ నాని సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘వి’. హీరో నాని మొదటిసారి విలన్‌గా కనిపించనున్నాడు. అదితిరావు హైదరి నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నానిని హీరోగా పరిచయం చేసిన డైరెక్టరే.. ఇప్పుడు విలన్‌గా చూపిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్ ను ఫిబ్రవరి 17 న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ.. నాని సుధీర్ బాబు పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాజు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు, నాజర్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా మార్చి 25న ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here