‘టక్ జగదీశ్’ గా రాబోతున్న న్యాచురల్ స్టార్ నాని..

5
258

‘గ్యాంగ్ లీడర్’ మూవీతో ఇటీవలే సక్సెస్ ని అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘వి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణలో ఉండగానే నాని తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘టక్ జగదీశ్’ అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, నాని వెనక్కి తిరిగి టక్‌ సరి చేసుకుంటున్న స్టిల్‌ ని విడుదల చేసారు. ఈ స్టిల్ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నుకోరి’ తర్వాత వస్తున్న రెండవ సినిమా ఇది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here