సమ్మె విరమణపై మండిపడ్డ నేషనల్ మజ్దూర్ యూనియన్

0
110

సమ్మె విరమణపై నేషనల్ మజ్దూర్ యూనియన్ మండిపడింది. ఆర్టీసీ సమ్మెకు నేషనల్ మజ్దూర్ యూనియన్ తన సంపూర్ణ సహకారం అందించిందని..
కార్మికుల బలిదానాలు, 47 రోజుల సుదీర్ఘ సమ్మె, సుమారు 400 కోట్ల ఆర్ధిక నష్టం తర్వాత నేడు జేఏసీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నేతలు తెలిపారు.

ఈ మేరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ కమల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం నరేందర్, ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, అదనపు ప్రధాన కార్యదర్శి సాయిలు, సత్యం ఒక ప్రకటన విడుదల చేశారు. తగిన న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీపై నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు విమర్శలు గుప్పించారు.

ఆర్టీసీ జేఏసీ సమస్యలన్నిటినీ గాలికి వదిలేసిందన్నారు.
47 రోజులు సమ్మె పోరాటాన్ని గాలికి వదిలివేసిందని దుయ్యబట్టారు. యావత్తు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది జేఏసీ ఆత్మాభిమానం దెబ్బతీసిందని మండిపడ్డారు. ఆర్టీసీ అమరవీరుల త్యాగం వృథా పోరాదన్నారు.
నాయకులు చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా డ్యూటీలకు వెళ్లే పరిస్థితులలో కార్మికులు లేరన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here