నా కెరీర్ లో అదే నేను చేసిన పెద్ద తప్పు – Nayanthara

0
111

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంతటి స్థాయికి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. తను తనకు నచ్చిన స్క్రిప్ట్ లను మాత్రమే ఎంచుకుంటుంది. ఇటీవలే నయన్ చాల వరకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువగా చేసింది. తర్వాత సైరా మూవీలో మరియు విజిల్ మూవీలో తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు.

తాజాగా ఓ రేడియో ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నయన్ తన కెరీర్ లోని తనకి బాధ కలిగించిన విషయాన్ని తెలిపారు. గతంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విడుదలై బ్లాక్ బస్టర్ ఐన సూర్య మూవీ ‘గజినీ’ లో మెడికల్ స్టూడెంట్ గా నయన్ పాత్ర గురించి వారు నాకు చెప్పింది వేరు స్క్రీన్ మీద కనిపించింది వేరుగా ఉంది. అది తన కెరీర్ లో పెద్ద తప్పుగా భావిస్తున్నానని చెప్పింది.

మళ్లీ 15 ఏళ్ల తర్వాత అదే డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దర్బార్’ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటిస్తున్నారు నయనతార. తర్వాత ఈ సినిమా గురించి నయన్ ఏం చెబుతుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here