నందమూరి బాలకృష్ణ ”రూలర్” కొత్త పోస్టర్…

0
231

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ”రూలర్”. ఈ చిత్రం బాలకృష్ణకు 105 వ చిత్రం. వీరి కాంబినేషన్ లో ‘జై సింహా’ తర్వాత ఇది రెండవ చిత్రం. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గతంలో సోనాల్ బాలకృష్ణతో ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ మూవీస్ లో నటించింది.

ఈ ‘రూలర్’ చిత్రంలో బాలకృష్ణ స్టైల్ అవెంజర్స్ మూవీస్ లోని ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ ను పోలి ఉంది. అంతేకాకుండా వినాయక చవితికి రిలీజ్ అయిన రెండు పోస్టర్లలో బాలకృష్ణ క్లాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన మరో కొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో బాలయ్య తన ఒంటి నిండా పసుపు కుంకుమతో చేతితో కత్తిని పట్టుకుని మాస్ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ లో కనిపించబోతున్నారని సమాచారం.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, రఘు బాబు, ధన్ రాజ్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here