తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపు.. 10 రూపాయలుంటేనే పల్లె వెలుగు ప్రయాణం

0
116

ఆర్టీసీ సమ్మె తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెంచిన బస్సు ఛార్జీలు ఈ రోజు (డిసెంబర్ 3) అర్ధరాత్రి 12 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. ప్రతీ కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు ప్రయాణం చేయాలంటే కనీస చార్జీ 10 రూపాయలుగా నిర్ణయించారు.

సెమీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీలు గతంలో కిలో మీటరుకు 75 పైసలు ఉండగా దానిని 95 పైసలకు, అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీలు కిలో మీటరుకు 87 పైసల నుంచి 107 పైసలకు పెంచారు. పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో కిలో మీటరుకు 20 పైసల చొప్పున చార్జీలు పెరగనున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలో మీటరుకు 63 పైసల నుంచి 83 పైసలకు పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here