‘నిశ్శబ్దం’ అనుష్క ఫస్టులుక్ పోస్టర్ విడుదల..

0
124

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా దాదాపు విదేశాల్లోనే జరుగుతూ వస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబందించిన అనుష్క ఫస్టులుక్ పోస్టర్ ను సెప్టెంబర్ 11 (బుధవారం ) రోజున విడుదల చేసారు. ఈ పోస్టర్ లో అనుష్కని చూస్తే ఒక ‘సాక్షి’ అనే ఓ చిత్రకారిణిగా కనిపిస్తోంది. ఈ సినిమాలో మైఖేల్ మాడిసన్, అంజలి, షాలినీ పాండే, మాధవన్, సుబ్బరాజు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, మరియు ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో ‘సైలెన్స్’ అనే టైటిల్‌తో వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here