అమ్మో అబ్దుల్లాపూర్‌మెట్టా..?.. భయపడుతున్న అధికారులు

0
89

తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో ఒక్కసారిగా అబ్దుల్లాపూర్‌మెట్ వార్తల్లో నిలిచింది. ఈ ఘటన తరువాత రెవెన్యూ డిపార్ట్‌మెంట్ మొత్తం అలెర్టైంది. కొందరు తహసీల్దార్‌లు తమ కుర్చీకి ముందు తాడు కట్టుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో ఆమెను కాపాడేందుకు వెళ్లిన డ్రైవర్ గురునాథం కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు కూడా నిన్న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. విజయారెడ్డి మృతితో అక్కడి స్థానం ఖాళీగా ఉంది. నిన్నటితో రెవెన్యూ ఉద్యోగులు తలపెట్టిన బంద్ కూడా పూర్తవడంతో కార్యాలయాల తలుపులు నేటి నుంచి తెరుచుకోనున్నాయి.

ఈ నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ స్థానానికి వెళ్లేందుకు ఏ అధికారి కూడా సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. విజయారెడ్డి ఘటనతో భయపడిపోయిన రెవెన్యూ అధికారులు ఆమె సీట్లో కూర్చునేందుకు ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు తహసీల్దార్‌గా వెళ్లేందుకు అధికారులు ససేమిరా అనడంతో.. సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here