అఫీషియల్: ‘అల.. వైకుంఠపురములో’ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వసూళ్లు.. సంక్రాంతి విన్నర్

0
96

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.85 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లుగా చిత్రబృందం అధికారికంగా తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేసింది. మొత్తం తెలుగు రాష్ట్రాల నుండి రూ.25.56 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా చుస్తే..

‘అల.. వైకుంఠపురములో’ మొదటిరోజు బాక్స్ ఆఫీస్ వసూళ్లు..

నిజాం: 6.01 కోట్లు
సీడెడ్: 4.02 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.87 కోట్లు
గుంటూరు: 3.41 కోట్లు
ఈస్ట్ గోదావరి: 2.98 కోట్లు
వెస్ట్ గోదావరి: 2.41 కోట్లు
కృష్ణా: 2.57 కోట్లు
నెల్లూరు: 1.29 కోట్లు
AP&TS: 25.56 కోట్లు

అంతేకాకుండా అమెరికాలోని ఒక్క కెనడాలోనే ఈ చిత్రం రూ. 18.10 లక్షల షేర్ ని రాబట్టింది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, సుశాంత్, నివేత పేతురేజ్ కీలక పాత్రలు పోషించారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీతాఆర్ట్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here