‘ఓ మై గాడ్..వాట్ ఈజ్ దిస్ క్రేజీనెస్’ – సమంత

0
266

ఇటీవలే విడుదలైన ‘ఓ బేబీ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న నాగశౌర్య తన తర్వాతి సినిమా కోసం జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఆ జిమ్ లో తీసుకున్న ఫోటోను నాగశౌర్య ఈరోజు(నవంబర్ 2) సాయంత్రం తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ‘డాడీ నన్ను ఈ ఫొటో పోస్ట్‌ చేయమన్నారు. నేను క్యాప్షన్‌ పెట్టి పోస్ట్‌ చేసే లోపు, తిట్టి నాతో ఏ క్యాప్షన్‌ లేకుండా ఇలా పోస్ట్‌ చేయించారు’ అని ట్వీట్ చేసారు.

ఈ పోస్ట్ ని చూసిన సమంత దీనిపై సరదాగా స్పందించారు. ‘ఓ మై గాడ్‌.. వాట్‌ ఈజ్‌ దిస్‌ క్రేజీనెస్‌’ అని నవ్వుతున్న ఎమోజీని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం నాగశౌర్య, రమణ తేజ దర్శకత్వంలో ‘అశ్వథామ’ మూవీ లో నటిస్తున్నారు. మెహరీన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోపక్క సంతోష్‌ జాగర్లపూడి తెరకెక్కించనున్న సినిమాలోనూ ఆయన నటించబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు. సమంత అక్కినేని ‘96’ తెలుగు రీమేక్‌ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here