ఒంగోలులో దారుణం: అమ్మాయిలను ట్రాప్ చేసి.. కోర్కెలు తీర్చుకున్న మాయలేడి

0
1106

అసహజ శృంగారం కోసం ఓ మాయలేడి అడ్డదారులు తొక్కింది. మగ గొంతుకతో అమాయకపు యువతులకు వల విసిరింది. ఆమె వలలో చిక్కుకుని బయటకు చెప్పుకోలేక ఎందరో యువతులు విలవిల్లాడిపోయారు. ప్యాంటు, షర్ట్ ధరించేందుకు ఇష్టపడే ఆ మహిళ ‘సెక్స్‌ టాయ్స్‌’ ఉపయోగించి పైశాచిక ఆనందం పొందడం అలవాటుగా మార్చుకుంది. ఈ వికృత చేష్టలకు పాల్పడిన మహిళ పేరు సుమలత. సాయితేజారెడ్డి పేరుతో యువతులకు ఫోన్ చేసి మగ గొంతుకతో మాట్లాడేది.

సుమలత స్వస్థలం ఒంగోలు జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం. భర్తను వదిలేసిన సుమలత.. ఏడుకొండలు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈమె వికృత చేష్టలకు ఏడుకొండలు సైతం అండగా నిలవడంతో ఇక ఆమెకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సుమలత, ఏడుకొండలకు సిమ్‌కార్డులు విక్రయించే వంశీ సహకారం కూడా తోడైంది. సిమ్‌కార్డుల కోసం వచ్చే యువతుల అడ్రెస్‌లను వంశీ సుమలతకు అందజేసేవాడు. దీంతో సుమలత యువతుల ఫోన్‌ నంబర్లను ట్రాప్‌చేసి, అవతలి మహిళలతో పరిచయం పెంచుకుని తన అవసరాలు తీర్చుకునేది.

విషయం వెలుగు చూసిందిలా…
సుమలత చేతిలో నరకం అనుభవించిన ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగు చూసింది. జరుగుమల్లి మండలంలోని ఓ గ్రామానికి ఈ నెల 2న సుమలత వెళ్లింది. అక్కడి నుంచి ఓ బాలికను తమ ఇంటికి తీసుకెళ్లి రెండు రోజులపాటు మత్తుమందు ఇచ్చి.. సెక్స్‌ టాయ్స్‌తో అత్యాచారం చేసింది.

ఆ బాధిత బాలిక ఇటీవల ‘స్పందన’లో భాగంగా జిల్లా ఎస్పీకి సుమలత గురించి ఫిర్యాదు చేసింది. దీంతో సుమలత బాగోతం వెలుగులోకి వచ్చింది. సుమలత కాకుండా, తనపై మరి కొంతమంది కూడా అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. విషయం బయటకు రావడంతో ఏడుకొండలు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు బుధవారం సుమలతను ఆమెకు సహకరించిన వంశీని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here