“నిర్మాతగా మారిన తర్వాతనే అసలైన మెగాస్టార్ ని చూసాను” – రామ్ చరణ్

0
26

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం “సైరా” నరసింహా రెడ్డి. షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ తన తండ్రి పై అభిప్రాయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

“సైరా సినిమా కోసం నాన్న పరివర్తన ఒక గొప్ప అనుభవం. నిర్మాతగా మారిన తర్వాతనే ఆయనలో అసలైన మెగాస్టార్ ని చూసాను” అని రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటుగా సైరా నరసింహా రెడ్డి రూపం లో ఉన్న తన తండ్రి గడ్డాన్ని పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఈ సినిమాను రామ్ చరణ్ భారీ బడ్జెట్ కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. ఇటీవల విడుదలైన “సైరా”మూవీ టీజర్ లో చూపిన సన్నివేశాలు సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అన్ని భాషా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై 300 కోట్ల భారీ బడ్జెట్ తో “సైరా” నరసింహారెడ్డి సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం లో చిరంజీవి నరసింహా రెడ్డి గా నటిస్తుండగా… అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు.
అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here