పాక్ కోర్టు సంచలన తీర్పు.. ముషారఫ్‌కు మరణశిక్ష

0
85

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ పెషావర్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆయనపై దాఖలైన తీవ్రమైన రాజద్రోహం కేసులో పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి ఎమర్జెన్సీ పాలన విధించడంతో ముషారఫ్‌పై తీవ్ర రాజద్రోహం కేసు నమోదైంది.

నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) ప్రభుత్వం.. 2007లో ఆయనపై ఈ కేసు నమోదు చేసింది. అయితే కేసు విచారణ జరుగుతుండగానే ముషారఫ్ పాక్ విడిచి వెళ్లిపోయారు. కోర్టు ఆయనను హాజరు కావాలని పలుమార్లు ఆదేశించినా కూడా పట్టించుకోలేదు. దీంతో నవంబర్ 19న ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. నేడు ముషారఫ్‌కు మరణశిక్షను విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. రాజద్రోహం కేసులో ఓ మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష విధించడం పాకిస్తాన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ముషారఫ్ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here