గోకుల్ నగర్ కాలనీలో పన్నాల దేవేందర్ రెడ్డి పర్యటన.. సమస్యల పరిష్కారానికై కృషి

0
103

మల్లాపూర్: గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని మల్లాపూర్ డివిజన్ లో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అనుక్షణం కృషి చేస్తున్నారు స్థానిక కార్పోరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి. ఇందులో భాగంగా ఈ రోజు (నవంబర్ 2) డివిజన్ పరిధి లోని గోకుల్ నగర్ కాలనీ సందర్శించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 

గోకుల్ నగర్ కాలనీ లోని ముగ్గురమ్మల దేవాలయంలో కాలనీ సభ్యులతో సమావేశమైన పన్నాల దేవేందర్ రెడ్డి.. కాలనీ సంక్షేమం కోసం కృషి చేస్తానని, కాలనీలో ఉన్న సమస్యలపై వెంటనే దృష్టి సారిస్తానని మాటిచ్చారు. ప్రధానంగా గోకుల్ నగర్ కాలనీలో మంజీరా వాటర్ సక్రమంగా రాకపోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ లేకపోవడంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు త్వరలోనే మిగిలిన రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. పార్క్ లో ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతీ వీధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. రోడ్లపై లారీల పార్కింగ్ సమస్య తీవ్రతరమైందని, ఇట్టి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు పన్నాల దేవేందర్ రెడ్డి.

రోడ్లపై చెత్త వేయమని, ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం చేపడతామని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామని కార్పోరేటర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు కాలనీ వాసులు. రేపు (ఆదివారం) ఉదయం కాలనీ జరగబోయే చెట్లు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా గోకుల్ నగర్ కాలనీ అధ్యక్షుడు టీ. మల్కయ్య పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాపోలు సతీష్, గోకుల్ నగర్ కాలనీ అధ్యక్షుడు టీ. మల్కయ్య, సెక్రెటరీ వీఎస్ఎన్ రెడ్డి, కె. రాజు, వీరబాబు, అజిత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సేరి రాజు, శివరాం ప్రసాద్, సీతారాం రెడ్డి, మూర్తి, బుచ్చి రెడ్డి, ఆంజనేయులు, రవి, సునీల్, సంబంధిత మున్సిపల్ శాఖ అధికారాలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here