‘వకీల్ సాబ్’ సెట్స్ నుండి లీకైన పవన్ స్టిల్స్..!

5
128

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీ హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ సెట్స్ నుండి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని సమ్మర్‌ను టార్గెట్ చేసుకుని మే 15న విడుదల కానున్నట్టు ప్రకటించారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ చేసారు. పవన్ కళ్యాణ్ దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘విరూపాక్షి’ సినిమాలో మరియు మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలోనే కాక మరికొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here