నిర్లక్ష్యంగా బస్ నడిపిన తాత్కాలిక డ్రైవర్‌ను చితక బాదిన జనం..

0
64

ఆర్టీసీ స్ట్రైక్ ను విరమించుకుని తిరిగి కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోలకు తరలి వస్తున్నారు. అయితే తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు వారిని విధుల్లో చేర్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు చేసే ప్రమాదాలు ఎక్కువవుతుండటంతో ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన మొదలైంది.

హైదరాబాద్ లోని బంజారాహీల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 12లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన జనం ఒక్కసారిగా తాత్కాలిక బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు. నిర్లక్ష్యంగా బస్ నడిపిన తాత్కాలిక డ్రైవర్‌ను చితక బాదారు. ఇటువంటి తాత్కాలిక డ్రైవర్లను నియమించినందుకుగాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here