జాగ్రత్త పడండి.. 10 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు

0
344

ఏప్రిల్ నెలలో 10 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకు ఖాతాదారులు, లావాదేవీలు నిర్వహించుకునేవారు అప్రమత్తంగా ఉండాల్సిన నెల ఇది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే అత్యధికంగా 11 సెలవులు ఈ నెలలో ఉన్నాయి కాబట్టి.

మార్చి 31న ఆర్థిక సంవత్సరం చివరి రోజు పని చేయడంతో ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన మరో 27 రోజుల్లో 10 రోజులు బ్యాంకులు ఉండవు. 6న ఉగాది, 7న ఆదివారం, 11న పోలింగ్, 13న రెండో శనివారం, 14న ఆదివారం, 17న మహావీర్‌ జయంతి, 19న గుడ్‌ ఫ్రైడే, 21న ఆదివారం, 27న నాల్గవ శనివారం, 28న ఆదివారం… ఈ పది రోజులూ బ్యాంకులు పని చేయవు కాబట్టి అన్ని బ్యాంకుల ఖాతాదారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here