గాంధీ జయంతి సందర్బంగా రూ. 150 స్మారక నాణాన్ని విడుదల చేసిన ప్రధాని మోడీ

2
315

బుధవారం అక్టోబర్ 2 న జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ లోని సబర్మతీ నది ఒడ్డున నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ రూ. 150 ల స్మారక నాణాన్ని విడుదల చేసారు.

ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ గాంధీ గారి 150 వ జయంతికి ఆయన కల ‘స్వచ్ఛ భారత్’ ని నెరవేర్చడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన జయంతిని యావత్ ప్రపంచం జరుపుకుంటుందన్నారు.

ఇదే విధంగా జనవరి లో ప్రధాని మోడీ సిక్కుల మత గురువైన గురు గోబింద్ సింగ్ జన్మదిన సందర్బంగా రూ. 350 స్మారక నాణాన్ని విడుదల చేసారు. అంతేకాకుండా గత ఏడాది కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జ్ఞాపకార్థంగా రూ. 100 స్మారక నాణాన్ని విడుదల చేసారు. ప్రధాని మోడీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి గాంధీ మహాత్మునికి ఘన నివాళులర్పించారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here