తహసీల్దార్ హత్యకు ముందు పక్కాగా రెక్కి.. ఓ రియల్టర్‌తో ఫోన్‌కాల్..

0
18

హైదరాబాద్: తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏసీపీ జయరాం ఆధ్వర్యంలో నాలుగు బృందాలు రంగంలోకి దిగి… ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుడు తిరిగిన ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిందితుడు సురేష్‌ వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేసిన పోలీసులు.. సురేష్‌ ఫోన్‌ కాల్‌డేటాను కూడా విశ్లేషించారు.

ఈ విశ్లేషణలో చివరిసారిగా సురేష్ ఓ రియల్టర్‌తో మాట్లాడినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే సురేష్‌ ఫోన్‌లో రికార్డ్‌ అయిన వాయిస్‌కాల్స్‌ను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. విజయారెడ్డి హత్యకు ముందు సురేష్ పక్కాగా రెక్కి నిర్వహించి.. అనంతరం దాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. తహసీల్దార్‌పై సురేష్ దాడికి పాల్పడటానికి వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here