ప్రముఖ నిర్మాత ఇంటిపై బండ్ల గణేష్‌ అనుచరుల దాడి.. పోలీస్ కేసు.. పరారీలో నటుడు

ప్రముఖ నిర్మాత ఇంటిపై బండ్ల గణేష్‌ అనుచరుల దాడి

0
62

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యాపారవేత్త, టాలీవుడ్ బడా నిర్మాత పీవీపీ ఈయనపై ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశారని పేర్కొంటూ బండ్ల గణేశ్ సహా మరో నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా అభ్యర్థించారు.

బండ్ల గణేష్‌, పీవీపీ మధ్య గత రెండేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాకు పీవీపీ 7 కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేయగా, ఆ డబ్బును బండ్ల గణేష్‌ తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. త కొంతకాలంగా డబ్బుకోసం ప్రయత్నించిన పీవీపీ, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో గత రాత్రి పీవీపీ ఇంటిపై బండ్ల గణేష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లో హల్ చల్ చేసి, నిర్మాత పీవీపీని, ఆయన కుటుంబ సభ్యులను బెదిరించారు. దీంతో ఈ విషయాన్ని తెలుపుతూ జూబ్లీహిల్స్ పీఎస్‌లో పీవీపీ స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు విచారణలో భాగంగా పోలీసులు బండ్ల గణేష్ ఇంటికి, ఆఫీసుకి వెళ్లగా ఆయన కనిపించక పోవడంతో ఆయన కోసం గాలింపు ప్రారంభించారు పోలీసులు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ లను నియమించినట్టు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతానికి బండ్ల గణేశ్ పరారీలో ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

ఒకరు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here