దిశ కేసు క్లోజ్ చేసేందుకు సన్నాహాలు

0
154

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసును క్లోజ్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. షాద్‌నగర్‌ కోర్టులో కేసుకు సంబంధించిన రిపోర్టు దాఖలు చేసి కేసు క్లోజ్‌ చేసేందుకు అనుమతి కోరేందుకు స్థానిక పోలీసులు సిద్ధమవుతున్నారు.

దిశ కేసు నిందితులు ఆరీఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందడంతో తదుపరి దర్యాప్తునకు వీలు లేదు. దీంతో కేసు క్లోజ్‌ చేసేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరనున్నట్లు సమాచారం. గతంలో కూడా దర్యాప్తునకు ఆస్కారం లేని పలు కేసుల్ని పోలీసులు కోర్టు అనుమతి తీసుకుని క్లోజ్ చేశారు. ఇదే విధానాన్ని దిశ కేసులోనూ పోలీసులు అనుసరించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసు క్లోజ్‌ అయినప్పటికీ… నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు మాత్రం కొనసాగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here