ఈ ఇండస్ట్రీలో నేను కలుసుకున్న మంచి వ్యక్తి ప్రభాస్.. పూజ హెగ్దే

0
113

స్లిమ్ బ్యూటీ పూజ హెగ్దే ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను స్టార్ హీరోల సరసన భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో మరియు పీరియడ్ రొమాంటిక్ డ్రామా ‘జాన్’ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది. తాజాగా పాపులర్ మీడియా పోర్టల్ జరిపిన ఇంటర్వ్యూలో పూజ హెగ్దే ప్రభాస్ గురించి తన అభిప్రాయాన్ని తెలిపింది.

‘ఈ ఇండస్ట్రీలో నేను కలుసుకున్న మంచి వ్యక్తి ప్రభాస్. ఆయన నిజాయితీ మరియు స్వతహాగా దయాగుణం ఉన్నవారు. ఆయన అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా అందరితో చాల సరళంగా ముక్కు సూటిగా వ్యవహరిస్తారు.’ ప్రభాస్ స్టార్ హీరోయిన్స్ తో ఎంతో లాయల్ గా ఉంటారనేది తెలిసిన విషయమే. అది సాహో చిత్రంతో నిరూపణ అయ్యింది.

‘సినిమా హిట్ కాకపోయినా ప్రేక్షకులు మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు అంటే వాళ్లే నిజమైన స్టార్స్ అనేది నా ఫీలింగ్. సల్మాన్ ఖాన్, ప్రభాస్ లాంటి స్టార్స్ విషయంలో ప్రత్యేకంగా ఆడియన్స్ వారి కోసమే వస్తారు.. వాళ్లే స్టార్స్..’ అని పూజ అన్నారు. వచ్చే ఏడాది 2020 లో ‘జాన్’ చిత్రం తెరపైకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here