హెడ్డింగ్స్‌ మాత్రం సూపర్‌ క్రేజీగా పెట్టారు భయ్యా – లైవ్ లో ప్రదీప్

0
203

నెల రోజులుగా ప్రదీప్ షూటింగ్ లో పాల్గొనక పోవడంతో తన ఆరోగ్యం పై అనేక వదంతులు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు కంగారుపడ్డారు. కానీ తనకి ఎటువంటి అనారోగ్య సమస్య లేదని తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో మాట్లాడారు. ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు.

‘నెల రోజులుగా నేను షూటింగ్ లో పాల్గొనక పోవడంతో అందరూ నాకు అనారోగ్యంగా ఉందనుకుని కంగారుపడ్డారు. కానీ అలాంటిదేమీ లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. షూట్‌ ఉంటే.. ఏదో ఒక రూపంలో మీతో మాట్లాడే అవకాశం ఉండేది. అందుకే ఈరోజు (నవంబర్ 8) లైవ్‌లో మాట్లాడాలనుకున్నా. నా పుట్టినరోజున (అక్టోబరు 23) చాలా మంది విష్‌ చేశారు అందరికీ థాంక్స్.

షోకు ఎందుకు రావడం లేదని చాలా మంది అడిగారు రిప్లై ఇవ్వలేకపోయాను. నెల రోజులుగా బ్రేక్‌లో ఉన్నాను అయినా బోర్ కొట్టలేదు. నాకు షూట్‌ అంటే చాలా ఇష్టం కాబట్టి.. రోజంతా సెట్‌లోనే గడిచిపోయేది. ఇంత పెద్ద బ్రేక్‌ ఎప్పుడూ తీసుకోలేదు. కొందరు యూట్యూబ్‌లో నా గురించి వీడియోలు చేసి, పెట్టారు. ‘క్షీణించిన ప్రదీప్‌ ఆరోగ్యం, బాధలో ప్రముఖులు’ అని రకరకాలుగా రాశారు. హెడ్డింగ్స్‌ మాత్రం సూపర్‌ క్రేజీగా పెట్టారు భయ్యా.

నేనెలా ఉన్నానో నా వారికి తెలుసు. కానీ, బయటి వారు కంగారుపడి చాలా మంది ఫోన్లు చేశారు. చాలా రోజుల క్రితం షూట్‌లో నా కాలికి చిన్న గాయమైంది. దాని వల్ల ఎక్కువ సేపు నిలబడవద్దని వైద్యులు చెప్పారు. అందుకే ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను. మరో వారంలో షూటింగ్‌కు హాజరు కాబోతున్నా. నాకు ఏదో అయ్యిందని తెలిసి.. ఎంతో మంది నేను కోలుకోవాలని మెసేజులు పెట్టారు. ఆ మెసేజ్‌లు చూసి చాలా సంతోషంగా ఫీలయ్యా. నా కుటుంబం ఇంత పెద్దదా..అనుకున్నా’ అని ప్రదీప్‌ లైవ్ లో మాట్లాడారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here