యష్ ఎకౌంట్ ని హ్యాక్ చేసిన రాధికా పండిట్.. యష్ ప్రిన్సెస్ ఐరా క్యూట్ వీడియో

0
167

యష్ పుట్టినరోజు సందర్బంగా యష్ భార్య రాధికా పండిట్ తన కుమార్తె ఐరా తో కలిసి తీసిన వీడియోను యష్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ‘ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి కేక్ తాయారు చేస్తాను కదా.. ఈసారి ఎవరు హెల్ప్ చేస్తున్నారో చూడండి.. పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ వీడియో పెట్టింది.

ఈ వీడియోను యష్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రేమతో హ్యాక్ చేశానంటూ.. ‘సర్ ప్రైజ్.. మీ లైఫ్ ని ఏవిధంగా స్వాధీనం చేసుకున్నామో.. మీ అకౌంట్ ని కూడా స్వాధీనం చేసుకున్నాము.. మీ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ నుండి హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ రాకింగ్ స్టార్’ అని పోస్ట్ చేసారు.

ప్రస్తుతం యష్ ‘కెజిఎఫ్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్బంగా సెకండ్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు చిత్రబృందం. ఈ ఏడాది జులై లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here