జార్జ్ రెడ్డి ‘రైజ్ యువర్ వాయిస్ ర్యాలీ’ ఫుల్ వీడియో సాంగ్..

0
164

సందీప్‌ మాధవ్‌, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం విడుదల చేసిన ‘రైజ్ యువర్ వాయిస్ ర్యాలీ’ సాంగ్ ప్రోమోకి మంచి స్పందన రాగా తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోని రిలీజ్ చేసింది చిత్రబృందం.

ఈ వీడియోలో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి సన్నివేశాలను చూపించారు. జార్జ్ రెడ్డి ‘జీనా హేతో మర్నా సీఖో’ అంటూ ‘రైజ్ యువర్ వాయిస్ బైక్ ర్యాలీ’ చేసే నేపథ్యంలో ‘హే.. సమరం.. మనది అయితే.. విజయం మనదే కదా..‘ అంటూ సాగే సాంగ్ ఇది. చాలా ట్రెండింగ్ గా ఉన్న ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఉస్మానియా విద్యార్థి నాయకుడు.. దాదాపు 45 ఏళ్ల కింద మరణించిన జార్జ్ రెడ్డి జీవితాన్ని ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పి రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 22 న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here