‘ఒరేయ్ బుజ్జిగా’: టామ్ & జెర్రీ పాత్రల్లో రాజ్ తరుణ్, మాళవిక.. మరో హాట్ బ్యూటీ కూడా.!

0
96

యంగ్ యాక్టర్ రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా విజయ్ కుమార్ కొండ (‘గుండె జారీ గల్లంతయ్యిందే’ ఫేమ్) దర్శకత్వంలో శ్రీ సత్య సాయి బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో మాళవిక, రాజ్ ని కొడుతున్నట్లుగా ఉండగా.. నిస్సహాయంగా చూస్తున్న రాజ్ తరుణ్ కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ చిత్రంలో రాజ్, మాళవికల పాత్రలు టామ్ & జెర్రీ ని పోలి ఉంటుందనిపిస్తోంది. అంతేకాకుండా ఈ రొమాంటిక్ మూవీలో హెబ్బా పటేల్ కూడా నటిస్తోంది.

రాజ్ హెబ్బా గతంలో ‘కుమారి 21F’ చిత్రంలో నటించారు. మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించనున్నారు. వాణి విశ్వనాధ్, పోసాని, నరేష్, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. యూత్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here