Raju Gari Gadhi 3 మూవీ ఒక తమిళ సినిమా రీమేక్…

0
54

ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలు ‘రాజు గారి గది’, రాజు గారి గది-2′ ఫ్రాంచెజీ లో వస్తున్న మరో సినిమా “రాజు గారి గది-3”. అశ్విన్ బాబు, అవికా గోర్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే ఈ ‘రాజు గారి గది-3’ మూవీ, తమిళంలో ‘దిల్లుకు దుడ్డు 2’ మూవీ రీమేక్ అని తెలిసింది. ఈ సినిమాలో సంతానం లీడ్ రోల్ పోషించారు. ఇదే విధంగా ‘రాజు గారి గది-2’ మూవీ కూడా మళయాళం మూవీ ‘ప్రీతమ్’ కు రీమేక్ గా తీయగా ఆ విషయాన్ని సినిమా రిలీజ్ అయ్యే వరకు గోప్యంగా ఉంచారు ఓంకార్.

ఇప్పుడు కూడా ‘రాజు గారి గది-3’ విషయం లో అదే బాట పట్టారు. ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన తర్వాత అందులో ఉండే సన్నివేశాలను బట్టి అది తమిళ మూవీ ‘దిల్లుకు దుడ్డు 2’ అని తెలుస్తోంది. ఇక ఈ ఆరోపణలపై ఓంకార్ ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here