రామ్ చరణ్ చేతుల మీదుగా గల్లా అశోక్ తొలి సినిమా గ్రాండ్ ఓపెనింగ్..

0
353

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా రూపొందనున్న తొలి సినిమా చాల గ్రాండ్ గా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజాకార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. హీరోహీరోయిన్లు అశోక్ నిధి అగర్వాల్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్‌నిచ్చారు. హీరో రాణా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ స్క్రిప్ట్‌ను దర్శక నిర్మాతలకు అందించారు.

గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమంలో గల్లా కుటుంబ సభ్యులు రామచంద్రనాయుడు, అరుణ కుమారి, జయదేవ్ పద్మావతితో పాటు నటుడు వీకే నరేశ్‌, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, నమ్రత శిరోద్కర్, హీరో సుధీర్ బాబు, అమల, హీరో సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా విచ్చేశారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహేష్ బాబు మరియు రామ్ చరణ్ అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ వేడుకలో పాల్గొనలేదు. ఎందుకంటే మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ పొల్లాచి లో షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కానీ మహేష్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తన విషెస్ ని తెలిపారు.

‘దేవదాస్‌’ ఫేం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందించనున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here