RRR ఫిట్ నెస్ ట్రైనర్ తో రామ్ చరణ్ సండే వర్కౌట్..

0
443

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ ఈ పాత్ర కోసం పాపులర్ సెలబ్రిటీ ట్రైనర్ రాకేష్ ఉడియార్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. రాకేష్ ఉడియార్ బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ ల పర్సనల్ ట్రైనర్.

సుల్తాన్ మూవీకి దంగల్ మూవీకి ఇతనే ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేసారు. రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం’ ‘ధృవ’ మూవీస్ తర్వాత మళ్లీ ర్ మూవీకి రాకేష్ ఫిట్ నెస్ ట్రైనర్ గా చేస్తున్నారు. చెర్రీ రాకేష్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘RRR ట్రైనర్ రాకేష్ ఉడియార్ తో సండే వర్కౌట్’ అంటూ ట్వీట్ చేసారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా..  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ భామ అలియా భట్, ఇంకా ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 30 న విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here