రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీ విడుదలకు లైన్ క్లియర్.. విడుదల తేదీ ఖరారు

0
452

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ తో తెరకెక్కించగా దీనిపై పలు వివాదాలు రావడంతో టైటిల్ ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. అంతేకాకుండా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేయగా.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసి.. సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు.

ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు రివైజింగ్ కమిటీని.. చిత్రాన్ని పూర్తిగా చూసి, సెన్సార్ చేయాలని తెలిపింది. ఇక రివైజింగ్ కమిటీ ఈ మూవీకి కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు సిద్ధమైంది.

దీంతో ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ.. ”మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పటికీ ఉందని అర్థమైంది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ పూర్తయింది. డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది” అని ట్వీట్ చేశాడు. వెంటనే మరో ట్వీట్‌లో ”సారీ సారీ సారీ.. అలవాటులో పొరపాటు.. నా ఉద్దేశ్యం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” అని వర్మ ట్వీట్ చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here