‘రెడ్’ మూవీ విడుదల తేదీ ఖరారు.. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్!

1
428

ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళంలోని ‘తడం’ మూవీ రీమేక్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెడ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ డ్యూయెల్ రోల్ లో అలరించనున్నారు.

ఇప్పటికే టీజర్ తో ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రబృందం ఖరారు చేస్తూ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా రెడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆంధ్ర మరియు సీడెడ్ ప్రాంతాల్లో భారీగా జరిగిందని సమాచారం.

వైజాగ్ మినహా ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 11 కోట్లకు జరిగింది. ఇమా సీడెడ్ లో రూ. 4 కోట్ల వరకు జరిగిందని సమాచారం. ఇకపోతే వైజాగ్, నిజాం, కృష్ణా ప్రాంతాల్లో.. రెడ్ మూవీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ స్వయంగా విడుదల చేయనుంది. ఈ చిత్రంలో నివేత పేతురేజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

1 COMMENT

  1. Greetings! I know this is kinda off topic but I’d figured I’d ask. Would you be interested in trading links or maybe guest authoring a blog article or vice-versa? My blog covers a lot of the same topics as yours and I think we could greatly benefit from each other. If you happen to be interested feel free to shoot me an email. I look forward to hearing from you! Awesome blog by the way!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here