‘క్వీన్’ టీజర్.. జయలలితగా రమ్యకృష్ణ

2
232

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా గౌతమ్ మీనన్ ‘క్వీన్’ టైటిల్ తో వెబ్ సిరీస్ ను తీయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘క్వీన్‌’ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా ‘క్వీన్‌’ టీజర్‌ను విడుదల చేశారు. ‘స్కూల్‌ డేస్‌లో స్టేట్‌ టాపర్‌, 18 ఏళ్ల వయసుకే స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగి, చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయి మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే ‘క్వీన్‌’ మీకోసం ఎదురుచూస్తుంది. ‘క్వీన్ ఈజ్ కమింగ్’’ అని ‘క్వీన్‌’ చిత్రబృందం పేర్కొంది. అంతేకాకుండా ఈ నెల 5 వ తేదీన ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు.

అయితే జయలలిత జీవిత ఆధారంగా ఎన్నో చిత్రాలు తెరకెక్కుతుండగా.. వాటిలో రెండు చిత్రాలు విడుదలకు ముందే ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అందులో ఒకటి గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించే ‘క్వీన్‌’ కాగా.. మరొకటి విజయ్‌ తెరకెక్కిస్తున్న ‘తలైవి’. ఇందులో కంగనా రనౌత్‌ జయలలితగా నటిస్తున్నారు.

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here