‘నీతో ఒక బ్యూటీఫుల్‌ లైఫ్‌ను ఊహించుకున్నాను’.. రాశీఖన్నా

0
119

రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లయిన వెంకటేష్, నాగ చైతన్య ‘వెంకీ మామ’ చిత్రంలో మామా అల్లుళ్లలా నటించారు. పాయల్ రాజపుట్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తాజాగా నవంబర్ 30 శనివారం రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ‘రాశి ఖన్నా బర్త్ డే గ్లింప్స్’ స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది.

ఇందులో ‘నీతో ఒక బ్యూటీఫుల్‌ లైఫ్‌ను ఊహించుకున్నాను’ అని రాశీఖన్నా.. నాగచైతన్యతో అంటున్నారు. ఈ సినిమాలో రాశీఖన్నా పాత్రను తెలియజేసేలా ఈ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, పోసాని, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here