‘సరిలేరు నీకెవ్వరూ’ నుండి రష్మిక మండన్న న్యూ ట్రెడిషనల్ లుక్..

0
169

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే మహేష్ విజయశాంతి రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని చిత్ర బృందం విడుదల చేయగా వాటికి మంచి స్పందన లభించింది.

తాజాగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సెట్స్ నుండి రష్మిక ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో రష్మిక లంగావోణి సాంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తున్నారు. సుప్రీమ్ మూవీలో బెల్లం శ్రీదేవి, F2 మూవీలో హనీ క్యారెక్టర్ ద్వారా కామెడీ క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీలో రష్మిక యొక్క ఫన్నీ సైడ్ ను కూడా చూపించబోతున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో మహేష్ రష్మిక ల మధ్య లిప్ లాక్ సీన్ ఉండబోతుందని సమాచారం.

ఇంకా రష్మిక ‘భీష్మ’ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాకుండా ‘పొగరు’ అనే కన్నడ మూవీలో కూడా నటిస్తోంది. ఈ మూవీలో ధ్రువ సార్జా హీరోగా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here