భలే ఖిలాడి రవితేజ అంటున్న డైరెక్టర్..!

7
562

రీసెంట్ గా ‘డిస్కో రాజా’ మూవీతో మనముందుకు వచ్చిన రవితేజ వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా.. లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. లాక్ డౌన్ పూర్తైన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా..

తాజాగా రవితేజ నెక్స్ట్ తన కొత్త ప్రాజెక్ట్ టైటిల్ నెట్టింట వైరల్ అవుతోంది. రవితేజ భలే ఖిలాడీ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే.. రవితేజ తన నెక్స్ట్ ఫిలిం రమేష్ వర్మ దర్శకత్వంలో చేయనున్నారు. రమేష్ వర్మ ఇటీవలే ‘రాక్షసుడు’ చిత్రంతో సక్సెస్ ని అందుకున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్ట్ చేయబోతున్న రవితేజ మూవీకి ‘ఖిలాడీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు సమాచారం. ఈ చిత్రంలో రవితేజ రెండు షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here