రవి బాబు, ‘ఆవిరి’ ట్రైలర్…

6
392

విలక్షణ దర్శకుడు రవి బాబు తెరకెక్కించనున్న తాజా చిత్రం “ఆవిరిి”(అవును-3). ఆయన థ్రిల్లర్, హారర్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక నటుడిగా మరియు దర్శకుడిగా కూడా రవి బాబు మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు.

రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. అందులో “రాజ్ కుమార్ అనే అతను నివసించే ఇంట్లో ఒక ఆత్మ కూడా నివసిస్తోంది. వాళ్లకొక చిన్న అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒకరోజు ఇంట్లోనుండి వెళ్లిపోతుంది. తానొక్కతే వెళ్లిందా…లేక ఒక ఆత్మ తీస్కెళ్లిందా…తీసుకెళ్తే ఎక్కడికి తీస్కెళ్లింది? తిరిగి ఆ అమ్మాయి ఇంటికొచ్చిందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

ఈ సినిమాలో రవి బాబు ప్రధాన పాత్రలో నటించారు. ఇంకా నేహా చౌహన్, శ్రీ ముక్త, భరణి శంకర్ తదితరులు కీలక పాత్రాల్లో నటించనున్నారు. కథ, దర్శకత్వం కూడా రవి బాబుదే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. హారర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here