బ్యాంకు ఖాతాదారులకు వీలుగా RBI కొత్త నిబంధనలు…

0
97

ఇటీవల RBI, బ్యాంకు ఖాతాదారుల కోసం కొత్తగా కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసింది. వినియోగదారుల ఖాతాల నుండి డబ్బు కట్ అయినా, ATM నుండి రాకపోవడం, మనీ ట్రాన్స్ ఫర్ చేసినా అవతల వ్యక్తికి చేరకపోవడం వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కొరకు RBI ఖచ్చితమైన నిబంధనలను ఏర్పాటు చేసింది.

ఇకపై వినియోగదారుల ఖాతాల నుండి మనీ కట్ అయి అవతల వ్యక్తికి/సంస్థకి గానీ చేరకపోతే, ఆ నగదు మొత్తాన్ని 1-5 రోజుల్లోపు ఆ ఖాతాదారునికి చేరాల్సిందేనని RBI స్పష్టంగా తెలిపింది. ఒక వేళా గడువు లోపు ఖాతాదారునికి చేరకపోతే రోజుకి రూ.100 చొప్పున జరిమానా చెల్లించాలని బ్యాంకులకు, ఆర్ధిక సంస్థలకు RBI ఆదేశాలను జారీ చేసింది.

సరిపోయినంత నగదు లేకపోయినా, కమ్యూనికేషన్ ఫెయిల్ అయినా, టైం అవుట్ సెషన్స్ వంటి వైఫల్యాలకు బ్యాంకులే బాధ్యత వహించాలని RBI స్పష్టం చేసింది. అక్టోబర్15 నుండి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారుని ఖాతా నుండి మనీ కట్ అయినా, ATM నుండి నగదు రాకపోయినా, ఈ లావాదేవీలు జరిగిన 5రోజుల్లో నగదు ఆ వినియోగదారుని ఎకౌంట్ లోకి చేరాలి. 5రోజుల్లో చేరని పక్షంలో 6వ రోజు నుండి, రోజుకు 100 రూపాయల జరిమానా చొప్పున బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది.

కార్డు తో కార్డు లావాదేవీలు జరిపినపుడు ఒక రోజులోపు; PSO , e-కామర్స్ ద్వారా జరిగే లావాదేవీలకు 5రోజులలోపు; IMPS ద్వారా జరిపిన లావాదేవీలకు ఒక రోజులోపు అవతల వ్యక్తికి నగదు అందనిచో ఆ నగదు తిరిగి వినియోగదారుని ఎకౌంట్ కు వాపస్ రావాల్సి ఉంటుంది.

UPI చెల్లింపులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అప్పటికి సమస్య తీరని పక్షంలో వినియోగదారులు రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ కు కంప్లయింట్ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here