12 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చిన ఆయేషా హత్యాచారం.. రీ పోస్ట్ మార్టం పూర్తి

0
92

దాదాపు 12 సంవత్సరాల క్రితం విజయవాడ లోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థిని లైంగికదాడి.. ఆపై హత్యకు గురైంది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ కేసులో సత్యం బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు.

కానీ విచారణ తర్వాత అతను నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చి, ఈ కేసును సిబిఐకి అప్పగించింది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు కొడుకుపై, హాస్టల్ వార్డెన్ పై అనుమానమున్నట్లు మొదట్నుంచి అయేషా తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. కాగా.. ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం కావడంతో తిరిగి ఆధారాలు సేకరించడం సిబిఐకి పెద్ద సవాల్ గా మారింది.

దీంతో సిబిఐ ఆయేషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం చేయాలని నిర్ణయించుకుంది. కానీ దీనికి ముస్లిం మత పెద్దలు నిరాకరించడంతో సిబిఐ.. కోర్ట్ పర్మిషన్ తీసుకుని చెంచుపేట శ్మశానవాటికలో ఖననం చేసిన ఆయేషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని వెలికితీసి అవశేషాలను ఓ బాక్స్‌లో ఉంచి సీలు చేశారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో నాలుగు గంటల పాటు రీ పోస్టుమార్టం జరిగింది. రీపోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్‌ సిబ్బంది అయేషా పుర్రె, ఆస్థికలపై చిట్లిన గాయాలను గుర్తించి వాటిని పరిశీలించింది. అయేషా ఎముకల నుంచి కూడా పలు అవశేషాలను సేకరించింది. ఈ పోస్ట్ మార్టం నివేదికను ఫోరెన్సిక్ సిబ్బంది సిబిఐకు అప్పగించనుంది. ఈ ఆధారాలతో సీబీఐ అధికారులు విచారణ జరపనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here