మహేశ్ నిర్మిస్తున్న మూవీలో బద్రి హీరోయిన్?

4
77

అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సంస్థ తాజాగా ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. 26/11 ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో నటించడానికి రేణు దేశాయ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

తనకు మంచి ఆఫర్లు వస్తే నటించడానికి అభ్యంతరం లేదంటూ ఒకప్పటి కథానాయిక రేణు దేశాయ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సూపర్ స్టార్ మహేశ్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ చాలా పవర్ ఫుల్ పాత్ర కావడంతో ఆమె అంగీకరించే అవకాశాలు వున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.

ఇదే కాకుండా అడివి శేష్ గతంలో వచ్చిన ‘గూఢచారి’ మూవీ సీక్వెల్ ‘గూఢచారి 2’ లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ పాకాల దర్శకత్వం వహిస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here