సెల్ఫీ దిగుతానని కోరిన మహిళపై రేణు మోండల్ ఆగ్రహం.. వీడియో వైరల్

0
114

రేణు మోండల్ ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌లో కాలక్షేపం కోసం ఆమె పాడిన పాట ఆమెను ఒక బాలీవుడ్‌ గాయనిగా మార్చేసింది. ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై’ అనే పాట ఆమె పాడగా ఆ పాటను ఒకరు వీడియో తీసి ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీనని ఫీల్ అవుతున్నారు.

ఇటీవలే రేణూ మోండల్ ఓ షాపింగ్ మాల్ కు వెళ్ళింది. ఆమెను చుసిన ఓ మహిళ ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగాలని అనుకొని రేణూ మోండల్ భుజంపై చెయ్యి వేసి పిలిచింది. దీంతో రేణూ మోండల్ కు కోపం వచ్చి నా భుజంపై చెయ్యి ఎందుకు వేసావు అని ప్రశ్నించింది. అంతేకాదు ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీనని… నాకు దూరంగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాతరోజులని మర్చిపోయి ఆమె ప్రవర్తిస్తోన్న తీరు బాగోలేదు అని కొందరు, ఆమెకు పొగరు వచ్చిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here