‘జాన్’ చిత్రంలో తారుమారైన ప్రభాస్, పూజ హెగ్దే రోల్స్..

0
65

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘జాన్’. ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో పూజ వయోలిన్ టీచర్ గా ప్రభాస్ ఒక దొంగ పాత్రలో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. కానీ వీరి పాత్రలు తారుమారు అయ్యాయని సమాచారం.

అంటే.. ఈ చిత్రాన్ని పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలో 1970లల్లో పూజ వయోలిన్ టీచర్ గా, ప్రభాస్ దొంగగా వారి కథ యూరప్ లో స్టార్ట్ అవుతుందట. వారు మళ్లీ పునర్జన్మ ఎత్తాక ప్రభాస్ ఏమో వయోలిన్ టీచర్ గా, పూజానేమో ఒక క్రేజీ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఒక లుక్ లో గడ్డం మీసాలతో ఉంటే, రెండవ లుక్ లో క్లీన్ గా షేవ్ చేసుకుని కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది 2020 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here