RRR మూవీలో 7 సాంగ్స్ లో 3 దేశభక్తిని రగిలించే పేట్రియాటిక్ సాంగ్స్…

1
580

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదిరిచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రమిది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కొమరం భీమ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారనే విషయం తెలిసిందే.

RRR భారీ సినిమా కావడంతో నిర్మాణంతర కార్యక్రమాలకి చాల సమయం పడుతుంది. అందుకే జక్కన్న కనీసం వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఈ మూవీలో ఉత్కంఠ రేపే హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు అలరించే పాటలు కూడా ఉంటాయట. తాజాగా అందిన నివేదికల ప్రకారం RRR మూవీలో 7 పాటలు ఉండబోతున్నాయని సమాచారం.

సుద్దాన అశోక్ తేజ

వాటిలో దేశ భక్తిని రగిలించే 3 పేట్రియాటిక్ సాంగ్స్ ఉండబోతున్నాయి. రామ్ చరణ్, అలియా భట్ ల మధ్య 1 లేదా 2 రొమాంటిక్ సాంగ్స్ మరియు ఎన్టీఆర్ జోడీతో వచ్చే మరో కొన్ని పాటలతో కలిపి మొత్తం 7 పాటలు ఉండబోతున్నాయి. టాలీవుడ్ లో ప్రముఖ గేయరచయిత సుద్దాన అశోక్ తేజ RRR లో 3 పాటలను రాసారని తెలిపారు. ఆ 3 పాటలు దేశభక్తిని స్వతంత్రకాంక్షను రగిలించేవిగా రూపొందిస్తున్నారు. మిగిలిన సాంగ్స్ ని రాజమౌళి ప్రముఖ లిరిసిస్ట్ తో రాయించనున్నారట.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here