కనీస చార్జీని పెంచేందుకు ఆర్టీసీ నిర్ణయం

0
40

ఇప్పటి వరకూ 8 రూపాయిలు ఉన్న కనీస చార్జి రూ.10కు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన చార్జీలు నేటి అర్థరాత్రి నుంచే ఆర్టీసీ అమలు చేయనుంది. చిల్లర సమస్య తలెత్తకూడదనే కారణంగానే కనీస చార్జిని 10 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. సీఎం కేసీర్ ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీస చార్జీ రూ.8 ఉండడం వల్ల చిల్లర సమస్య తలెత్తుతోందని కార్మికులు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు కనీస చార్జీని రూ.10గా నిర్ణయించాలని అధికారులకు సీఎం సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here