ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. పరిస్థితి ఉద్రిక్తం

0
35

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పూనుకుని 43 రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ నేపథ్యంలో ఆందోళనను ఉధృతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ పూనుకుంది. దీనిలో భాగంగానే ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆఫీసులో దీక్షకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో యూనియన్‌ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమైన పోలీసులు… ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు సైతం అశ్వత్థామరెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు పోలీసుల యత్నిస్తుండటంతో.. అడ్డుకునేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here