ప్రధాన డిమాండ్ అయిన ఆర్టీసీ విలీనాన్ని వదిలేసి మిగతా సమస్యలపై చర్చలకు సిద్ధమని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. నేడు ఆయన తన ఇంట్లోనే దీక్షకు దిగారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..
ఆర్టీసీకి ప్రభుత్వం 3 వేల కోట్లు బాకీ ఉందన్నారు.
కో ఆపరేటివ్ నిధులు 565 కోట్లతో పాటు.. పీఎఫ్ నిధులు 723 కోట్లను ప్రభుత్వం వాడుకుందన్నారు.
అసెంబ్లీలో రవాణా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీకి ప్రభుత్వం బాకీ ఉందని.. నిధులు విడుదల చేయాలని తెలిపారని.. కానీ సీఎం మాత్రం తాము బాకీ లేమని చెబుతున్నారని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రావట్లేదని…
27 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
ఇలాంటివి ఇక జరగకూడదని.. కార్మికుల భవిష్యత్ కోసం… ఒక మెట్టు దిగి ముందుకు వచ్చామన్నారు. 3 వేల బస్సులు కాలం చెల్లిపోయాయని… వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. నష్టాల్లో ఉన్న గ్రామీణ రూట్లలో కూడా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.