ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఏపీ కాబినెట్ ఆమోదం

0
202

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కాబినెట్ మీటింగ్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి కాబినెట్ ఆమోదం కూడా తెలిపింది.

1. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కాబినెట్ ఆమోదం తెలిపింది. దీని పట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనితో 52,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. కానీ దీని వలన ప్రభుత్వం పై 3,500 కోట్ల రూపాయిల భారం పడుతుందని తెలుస్తోంది.

2. రాష్ట్రంలో నూతన ఇసుక విధానానికి కాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ఈరోజు నుండి అమలులోకి రానుంది.

3. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుకునే వారికి రూ.10,000 సంవత్సరానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వీరు సెప్టెంబర్10 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్కోవచ్చు. వీరికి ఈ నెల 4వ వారం నుండి ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుందని చెప్పారు.

4. వైస్సార్ పెళ్లి కానుక పథకం కింద ఇచ్చే నగదును పెంచారు. ఇది శ్రీరామ నవమి నుండి అమల్లోకి రానుందని చెప్పారు. ఎస్సీ లకు రూ.40,000 నుండి రూ.1,00,000 కు పెంచారు. ఎస్టీ లకు రూ.50,000 నుండి రూ.1,00,000 కు; బీసీ లకు రూ.35,000 నుండి రూ.50,000 కు; మైనారిటీ లకు రూ.50,000 నుండి రూ.1,00,000 కు పెంచారు.

5. ఆశా వర్కర్ల కు జీతాన్ని రూ.3,000 నుండి రూ.10,000 కు పెంచడానికి కాబినెట్ ఆమోదాన్ని తెలిపింది.

6. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కాబినెట్ ఆమోదాన్ని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here