చెరో మెట్టు దిగి సమస్యను పరిష్కరించండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

0
70

ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు చెరో మెట్టు దిగి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపింది. దేనికైనా పట్టువిడుపులు ఉండాలని.. మీ మధ్యలో కోట్లాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారనే విషయం గమనించాలని సూచించింది.

ముందుగా పెద్దలే తగ్గాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యపై ప్రభుత్వం ఇంత మంకుపట్టు పడుతుందని తాము ఊహించలేదని సీజే చౌహాన్ పేర్కొన్నారు. అధికారులైనా, న్యాయ వ్యవస్థ అయినా ప్రజల కోసమే పని చేస్తాయన్నారు. ఎన్నో విధాలుగా చెప్పి చూశామని, కార్మికుల 45 డిమాండ్లలో 20 పరిష్కరించదగ్గవే ఉన్నాయని స్పష్టం చేశారు. నాలుగు ప్రధాన డిమాండ్లు రూ.49 కోట్లు ఇస్తే తక్షణమే పరిష్కారమయ్యేవని పునరుద్ఘాటించారు. ఆ డబ్బు కూడా తమ దగ్గర లేదంటే ఎలా? అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here